Online Puja Services

శ్రీశైల క్షేత్రాన స్థిరముగా వెలసిన పాట | శివుని మంగళ హారతి పాట

3.142.12.240

శ్రీశైల క్షేత్రాన స్థిరముగా వెలసిన పాట | శివుని మంగళ హారతి పాట | Srisaila Kshetrana|Mangala Harathi | Shiva Mangala Harathi Song


శ్రీశైల క్షేత్రాన స్థిరముగా వెలసిన 
మల్లిఖార్జున నీకు జయమంగళం 
భ్రమరాంబికా నీకు శుభ మంగళం 

శ్రీశైల క్షేత్రాన స్థిరముగా వెలసిన 
మల్లిఖార్జున నీకు జయమంగళం 
భ్రమరాంబికా నీకు శుభ మంగళం 

శిరమందు గంగమ్మ, ఉరమందు గౌరమ్మ 
వంపుగా వయ్యార మొలికింపగా 

శిరమందు గంగమ్మ, ఉరమందు గౌరమ్మ 
వంపుగా వయ్యార మొలికింపగా 

మా బొజ్జ గణపతి నీ చెంత నిలువంగ 
చిలిపి షణ్ముఖ స్వామి చిన్నగా నవ్వగా 

శ్రీశైల క్షేత్రాన స్థిరముగా వెలసిన 
మల్లిఖార్జున నీకు జయమంగళం 
భ్రమరాంబికా నీకు శుభ మంగళం 

తలపైన జాబిల్లి తళతళ వెలుగంగ 
గళమందు కాళంబు నిగనిగ కదలంగ 

తలపైన జాబిల్లి తళతళ వెలుగంగ 
గళమందు కాళంబు నిగనిగ కదలంగ 

భ్రమరాంబిక కనులు మిలమిల మెరియంగ 
భృంగీశు, నందీశు సరిగమలు పాడంగ

శ్రీశైల క్షేత్రాన స్థిరముగా వెలసిన 
మల్లిఖార్జున నీకు జయమంగళం 
భ్రమరాంబికా నీకు శుభ మంగళం 

శ్రీశైల క్షేత్రాన స్థిరముగా వెలసిన 
మల్లిఖార్జున నీకు జయమంగళం 
భ్రమరాంబికా నీకు శుభ మంగళం 

 

 

Srisaila, Sri Saila, Kshetram, Shiva, Siva, Mangala, Harathi, Harati, Aarti, song

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda